శుక్రవారం.. భక్తుల రద్దీ ఎంతంటే?

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శుక్రవారం కావడంతో కొంత భక్తుల రద్దీ పెరిగింది.

Update: 2023-04-21 02:23 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శుక్రవారం కావడంతో కొంత భక్తుల రద్దీ పెరిగింది. రేపు, ఎల్లుండి శని, ఆదివారాలు కావడంతో భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉండనుంది. ఈరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని ఆరు కంపార్ట్‌మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం భక్తులకు ఐదు గంటల్లో శ్రీవారి దర్శనం పూర్తవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఇక టోకెన్లు లేకుండా సర్వదర్శనం క్యూ లైన్‌లోకి ఈరోజు ఉదయం ఏడు గంటలకు ప్రవేశించిన భక్తులకు మాత్రం శ్రీవారి దర్శనం పది గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.

నడకదారి.... నాలుగు గంటలు...
ఇక నడక దారి దివ్యదర్శనానికి వచ్చే భక్తులకు నాలుగు గంటల్లోగా స్వామి వారి దర్శనం పూర్తవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు మాత్రం రెండు నుంచి మూడు గంటల్లో శ్రీవారి దర్శనం పూర్తవుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 56,680 మంది దర్శించుకున్నారు. వీరిలో 18,497 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.54 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెలిపారు.


Tags:    

Similar News