దర్శన సమయం ఎన్ని గంటలంటే?

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శని, ఆదివారాలు కావడంతో భక్తుల రద్దీ తిరుమలలో మరింత పెరిగింది.

Update: 2022-07-10 03:45 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శని, ఆదివారాలు కావడంతో భక్తుల రద్దీ తిరుమలలో మరింత పెరిగింది. ప్రస్తుతం వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయి ఆస్థాన మండపం వరకూ క్యూ లైన్ కొనసాగుతుంది. దీంతో భక్తులు సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఈరోజు ఏకాదశి కావడంతో భక్తుల రద్దీ మరింత ఎక్కువయింది. స్వామి వారిని ఏకాదశి సందర్భంగా దర్శించుకునేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు రావడంతో తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది.

హుండీ ఆదాయం...
మరోవైపు నిన్న తిరుమల శ్రీవారిని 87,478 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 47,692 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న స్వామి వారి హుండీ ఆదాయం 4.53 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు చెప్పారు. భక్తుల రద్దీ మరికొన్ని రోజులు కొనసాగే అవకాశముంది. రద్దీ ఎంత ఉన్నా వారికి సౌకర్యాలను కల్పించడంలో అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.


Tags:    

Similar News