పది హేను గంటల దర్శన సమయం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయి భక్తులు ఎస్ఎంసీ వరకూ క్యూ లైన్లలో వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి భక్తులకు పది హేను గంటల సమయం పడుతుందని తిరుమల, తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. రేపు, ఎల్లుండి కూడా ఈ రద్దీ కొనసాగే అవకాశాలు కన్పిస్తున్నాయి.
నిన్న హుండీ ఆదాయం...
నిన్న తిరుమల శ్రీవారిని 64,079 మంది భక్తులు దర్శించుకున్నారు. 32,852 మంది భక్తులు తలనీలాలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.52 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల, తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.