Tirumala : తిరుమలలో సోమవారం కూడా తగ్గని భక్తుల రద్దీ.. అసలు కారణమిదేనట

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారం కూడా భక్తుల సంఖ్య తిరుమలలో ఎక్కువగానే ఉంది

Update: 2024-08-12 02:53 GMT

rush, devotees, monday, tirumala

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారం కూడా భక్తుల సంఖ్య తిరుమలలో ఎక్కువగానే ఉంది. సోమవారం కావడంతో కొంత రష్ తగ్గుతుందని అనుకున్నప్పటికీ ఎక్కువ మంది భక్తులు శ్రీవారి దర్శనం కోసం కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. తిరుమలలో రోజరోజుకూ ఇటీవల కాలంలో రద్దీ ఎక్కువగా ఉంది. వారాలతో సంబంధం లేకుండా భక్తుల రద్దీ కొనసాగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. దీనికి అనేక కారణాలు ఉండవచ్చని చెప్పారు. కేవలం ఏపీ, తెలంగాణ, తమిళనాడు నుంచి మాత్రమే కాకుండా ఉత్తర భారతదేశం నుంచి ఎక్కువ మంది భక్తులు తరలి వస్తుండటంతో భక్తుల రద్దీ కొనసాగుతుందని అంటున్నారు. అయితే పెరుగుతున్న భక్తులతో తిరుమలలోని శ్రీవారి హుండీ ఆదాయం కూడా పెరుగుతుంది.

పథ్నాలుగు కంపార్ట్‌మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని పథ్నాలుగు కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పది నుంచి పన్నెండు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయ పడుతుందని, టైమ్ స్లాట్ దర్శనానికి భక్తులకు నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 86,604 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 31,536 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.89 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News