తిరుమలలో చాంతాడంత క్యూ.. దర్శన సమయం?

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురువారం కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలలో స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు

Update: 2022-08-26 02:18 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురువారం కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలలో స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని కంపార్ట్‌మెంట్లన్నీ నిండి పోయి బయట టీబీసీ వరకూ క్యూ లైన్ ఉంది. వీరికి శ్రీవారి దర్శనానికి 16 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. ఎంత మంది భక్తులు వచ్చినా అన్న ప్రసాదాలతో పాటు, మంచినీటి వసతి కల్పిస్తామని అధికారులు వెల్లడించారు.

హుండీ ఆదాయం...
మరో వైపు 300 ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొన్నవారికి నాలుగు గంటల వరకూ సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 68,128 భక్తులు దర్శించుకున్నారు. 34,021 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకుని తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.44 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News