తిరుమలలో తగ్గని భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. బుధవారం కూడా భక్తులు శ్రీవారి దర్శనం కోసం గంటల బడి వేచి చూస్తున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. బుధవారం కూడా భక్తులు శ్రీవారి దర్శనం కోసం గంటల బడి వేచి చూస్తున్నారు. వైకుంఠం కాంప్లెక్స్ లోని 18 కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతుదందని చెబుతున్నారు. సెలవులు లేకపోయినా, వర్షాలు కురుస్తున్నా భక్తుల రద్దీ మాత్రం తిరుమలలో తగ్గడం లేదు.
హుండీ ఆదాయం...
నిన్న తిరుమల శ్రీవారిని 77,277 మంది భక్తులు దర్శించుకున్నారు. 31,272 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.36 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల, తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.