తిరుమలలో క్యూ లైన్ ఎంత పొడవుందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. వరస సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. వరస సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్‌మెంట్లన్నీ నిండి పోయి ఎంబీసీ కాంప్లెక్స్ వరకూ క్యూ లైన్లు కొనసాగుతున్నాయి. దీంతో శ్రీవారి దర్శన సమయం 14 గంటలకు పైగానే సడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. ఈ మూడు రోజులు రద్దీ మరింత పెరిగే అవకాశముంది.
తగ్గిన ఆదాయం...
నిన్న తిరుమల శ్రీవారిని 63,754 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 30,790 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.63 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.