తిరుమలలో క్యూలైన్లలోనే భక్తులు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి ఈరోజు పది గంటలకు పైగా సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెప్పారు. నిన్న ఆదివారం కావడం, తొలి ఏకాదశి కావడంతో భక్తులు పోటెత్తారు.
భక్తుల రద్దీతో...
ఈరోజు కూడా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. భక్తులకు అవసరమైన ఏర్పాట్లను టీటీడీ సమకూరుస్తుంది. వసతి గృహాలు దొరకక అనేక మంది ఇబ్బందులు పడుతుండటంతో దర్శనం పూర్తయిన వారిని టీటీడీ గదులను ఖాళీ చేయించే పనిలో ఉంది. నిన్న తిరుమల శ్రీవారిని 89,013 మంది భక్తులు దర్శించుకున్నారు. 37,698 మంది భక్తులు తలనీలాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.39 కోట్లుగా ఉందని అధికారులు వెల్లడించారు.