తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. 11 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు

Update: 2022-08-03 02:52 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. వీకెండ్ లోనే కాకుండా సాధారణ రోజుల్లోనూ భక్తులు తిరుమల కొండకు పోటెత్తుతున్నారు. అందుకే రెండు నెలల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ తగ్గడం లేదు. ఈరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 11 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. వీరికి శ్రీవారిని దర్శించుకోవడానికి ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల, తిరుపతి అధికారులు చెబుతున్నారు.

నిన్న కూడా....
నిన్న తిరుమల శ్రీవారిని 72,067 మంది భక్తులు దర్శించుకున్నారు. నాగ పంచమి కూడా తోడు కావడంతో ఎక్కువ మంది భక్తులు కొండకు వచ్చారని అధికారులు చెబుతున్నారు. 27,581 మంది భక్తులు తలనీలాలను సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.30 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
.


Tags:    

Similar News