తిరుమలలో తగ్గని భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో తిరుమలలో భక్తులు వేచి ఉన్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో తిరుమలలో భక్తులు వేచి ఉన్నారు. ప్రస్తుతం వైకుంఠం కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఈరోజు శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి అధికారులు చెబుతున్నారు. రేపటి నుంచి వీకెండ్ కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశముంది.
నిన్న 70 వేల మంది...
నిన్న తిరుమల శ్రీవారిని 70 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. 33,315 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.43 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి అధికారులు తెలిపారు. భక్తుల సంఖ్య ఎంత పెరిగినా వారికి తగిన సౌకర్యాలను సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నామని టీటీడీ అధికారులు చెబుతున్నారు.