తిరుమలలో ఈరోజు క్యూ లేపాక్షి వరకూ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. కరోనా తర్వాత భక్తులకు అనుమతించడంతో రెండు నెలల నుంచి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది

Update: 2022-07-20 03:19 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. కరోనా తర్వాత భక్తులకు అనుమతించడంతో గత రెండు నెలల నుంచి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ప్రతి రోజూ దర్శనానికి భక్తులు గంటల సమయం కొద్దీ వేచి ఉండాల్సిన పరిస్థితి తిరుమలలో ఉంది. గతంలో శని, ఆదివారాలు మాత్రమే రద్దీ ఉండేది. అయితే ఇప్పుడు వారంలో అన్ని రోజులు తిరుమల భక్తులతో కిటకిటలాడుతుంది. తిరుమలకు ఎంతమంది భక్తులు వచ్చినా వారికి సరైన సౌకర్యాలు కల్పిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు.

హుండీ ఆదాయం.....
ఈరోజు తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయాయి. బయట లేపాక్షి షోరం వరకూ భక్తుల రద్దీ కొనసాగుతుంది. దర్శనానికి ఆరు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 74,503 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,884 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.42 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News