తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. రెండురోజులుగా కొంత తగ్గిన రద్దీ నేటి నుంచి మళ్లీ పెరిగింది.rush of devotees
తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. రెండురోజులుగా కొంత తగ్గిన రద్దీ నేటి నుంచి మళ్లీ పెరిగింది. 31 కంపార్ట్‌మెంట్లలో శ్రీవారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి ఆరు గంటల సమయం పడుతుందని తిరుమల, తిరుపతి దేవస్థానం అధికారులు చెప్పారు. గురువారం నుంచి తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని ఆలయ అధికారులు చెబుతున్నారు.
హుండీ ఆదాయం....
నిన్న తిరుమల శ్రీవారిని 65,898 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,686 మంది తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.66 కోట్లు వచ్చింది. ఈ మూడు రోజులు భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశముంది.