తిరుమలలో మళ్లీ పెరిగిన రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ మళ్ల ీపెరిగింది. మంగళవారం కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది.

Update: 2022-08-02 03:01 GMT

తిరుమలలో భక్తుల రద్దీ మళ్ల ీపెరిగింది. మంగళవారం కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. జులై నెల మొత్తం భక్తులతో కిటకిటలాడిన తిరుమల ఆగస్టులోనూ అదే విధంగా భక్తుల రద్దీ కొనసాగే అవకాశముందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. ఈరోజు 18 కంపార్ట్‌మెంట్లలో శ్రీవారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. దర్శానినికి ఎనిమిది గంటల వరకూ సమయం పడుతుంది.

ఐదు కోట్లు...
ఊహించని స్థాయిలో భక్తుల రద్దీ పెరిగినా వారికి అవసరమైన సదుపాయాలను కల్పిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. సర్వదర్శనానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా కల్పిస్తున్నామన్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 71,450 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 31,320 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం ఐదు కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News