ఆదివారం క్యూ లైన్లలో...?

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది

Update: 2022-07-31 02:25 GMT

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. వైకుంఠంక కాంప్లెక్స్ లోని 22 కంపార్ట్‌మెంట్లలలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. స్వామి వారి దర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. గత వారం కంటే ఈ వారం కొద్దిగా భక్తుల సంఖ్య తగ్గిందని అధికారులు అంటున్నారు.

ఇకపై రద్దీ.....
విద్యాసంస్థలు తెరుచుకోవడంతో సాధారణ రోజుల్లో ఇక రద్దీ కొంత తగ్గే అవకాశముందని అంచనా వేస్తున్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 77541 మంది భక్తులు దర్శించుకున్నారు. 39,533 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.87 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.


Tags:    

Similar News