తగ్గని రద్దీ.. క్యూలైన్ పొడవు...?

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గలేదు. వైకుంఠం కాంప్లెక్స్ లోని కంపార్ట్‌మెంట్లన్నీ నిండి ఎస్ఎంసీ జనరేటర్ వరకూ క్యూ లైన్ ఉంది.

Update: 2022-07-14 03:08 GMT

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గలేదు. వైకుంఠం కాంప్లెక్స్ లోని కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయి ఎస్ఎంసీ జనరేటర్ వరకూ క్యూ లైన్ ఉంది. శ్రీవారి దర్శనానికి దాదాపు 13 గంటల సమయం పట్టే అవకాశముందని తిరుమల తిరుపతి అధికారులు చెబుతున్నారు. రెండేళ్లు కరోనా కారణంగా శ్రీవారి దర్శనానికి దూరంగా ఉండటంతో ఒక్కసారిగా తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారని అధికారులు చెబుతున్నారు.

హుండీ ఆదాయం....
నిన్న తిరుమల శ్రీవారిని 71,289 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,210 మంది తలనీలాలు సమర్పించి తమ మొక్కులను తీర్చుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.71 కోట్లు అని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెప్పారు. రానున్న మూడు రోజులు పాటు భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.


Tags:    

Similar News