శ్రీవారి దర్శన సమయం...?

తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. శ్రీవారి దర్శనం కోసం 12 కంపార్ట్‌మెంట్లలో భక్తులు ప్రస్తుతం వేచి ఉన్నారు.

Update: 2022-06-29 04:43 GMT

తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. శ్రీవారి దర్శనం కోసం 12 కంపార్ట్‌మెంట్లలో భక్తులు ప్రస్తుతం వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి ఆరు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెప్పారు. మంగళవారం వరకూ కొంత రద్దీగా కన్పించిన తిరుమల ఈరోజు మాత్రం కొంత రద్దీ తగ్గినట్లే కన్పిస్తుంది.

హుండీ ఆదాయం....
నిన్న తిరుమలలో శ్రీవారిని 77,154 మంది దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4.62 కోట్ల రూపాయలు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడింాచరు. నిన్న స్వామి వారికి 30,182 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. రేపటి నుంచి మరలా రద్దీ పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ప్రతి గురువారం నుంచి మంగళవారం వరకూ భక్తుల రద్దీ కొన్ని వారాలుగా అధికంగా ఉంటుందని టీటీడీ అధికారులు చెబుతున్నారు.


Tags:    

Similar News