తిరుమలలో తగ్గిన రద్దీ

తిరుమలలో భక్తులు రద్దీ కొద్దిగా తగ్గింది. శ్రీవారి దర్శనానికి ఆరు గంటల సమయం పడుతుంది.

Update: 2022-06-30 03:42 GMT

తిరుమలలో భక్తులు రద్దీ కొద్దిగా తగ్గింది. శ్రీవారి దర్శనానికి ఆరు గంటల సమయం పడుతుంది. 9 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. కంపార్ట్‌మెంట్లలో ఉన్న వారందరికి ఉచిత అన్న ప్రసాదం, మంచినీరు అందిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెప్పారు.

నిన్న హుండీ ఆదాయం...
నిన్న శ్రీవారిని 70,134 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,059 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.26 కోట్లు అని టీటీడీ అధికారులు వెల్లడించారు. తిరిగి రేపటి నుంచి భక్తుల రద్దీ పెరిగే అవకాశముందని చెబుతున్నారు.


Tags:    

Similar News