వారంతో పనిలేదు...ఎందుకింత రద్దీ...?
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గడం లేదు. వీకెండ్ తో సంబంధం లేకుండా ప్రతి వారం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గడం లేదు. కరోనాతో రెండేళ్లు ఆలయానికి భక్తుల రాకపోకలు నిలిచిపోయాయి. ఒక్కసారిగా భక్తులను అనుమతించడతో భక్తుల రద్దీ పెరిగిందనే చెప్పాలి. వీకెండ్ తో సంబంధం లేకుండా ప్రతి వారం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం కోసం 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరికి శ్రీవారి దర్శనానికి తొమ్మిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు.
హుండీ ఆదాయం...
నిన్న తిరుమల శ్రీవారిని 73,387 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,965 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.68 కోట్ల రూపాయలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. వారాలతో సంబంధం లేకుండా భక్తులు వస్తుండటంతో టీటీడీ అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తుంది.