శ్రీవారి దర్శన సమయం ఈరోజు ఎంతంటే?
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గడం లేదు. సోమవారం కూడా భక్తుల రద్దీ కొనసాగింది.
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గడం లేదు. సోమవారం కూడా భక్తుల రద్దీ కొనసాగింది. అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయి ఎస్ఎంసీ బస్ స్టాప్ వరకూ క్యూ కొనసాగుతుంది. దీంతో శ్రీవారి దర్శనానికి పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి అధికారులు తెలిపారు. నిన్న శ్రీవారిని 77,907 మంది భక్తులు దర్శించుకున్నారు. 38,267 మంది భక్తులు తలనీలాలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు.
రికార్డ్ బ్రేక్...
ఇక నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు బ్రేక్ చేసింది. నిన్న ఒక్కరోజే హుండీ ఆదాయం 6.18 కోట్ల రూపాయలు లభించినట్లు అధికారులు చెప్పారు. పదేళ్ల తర్వాత తొలిసారి ఈ ఆదాయం ఒక్క రోజు లభించింది. 2012 ఏప్రిల్ 1వ తేదీన శ్రీవారికి 5.73 కోట్ల ఆదాయమని, దానిని అధిగమించి నిన్న ఒక్కరోజు 6.18 కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు చెప్పారు. నెలకు వంద కోట్లకు పైగానే శ్రీవారి ఆదాయం గత మే నెల నుంచి లభిస్తుంది. కరోనా తర్వాత భక్తులను పూర్తి స్థాయిలో అనుమతించడంతో అత్యధిక సంఖ్యలో భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు.