వీకెండ్.. తిరుమలలో పెరిగిన రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గడం లేదు. శని, ఆదివారాలు కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది.

Update: 2022-06-26 02:52 GMT

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గడం లేదు. శని, ఆదివారాలు కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఉన్న కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయాయి. బయట క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. గురువారం నుంచి ఆదివారం వరకూ ప్రతి వారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని తిరుమల, తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. తమిళనాడు నుంచి ఎక్కువ భక్తులు రావడం కూడా రద్దీ పెరగడానికి ఒక కారణమంటున్నారు.

హుండీ ఆదాయం....
నిన్న తిరుమల శ్రీవారిని 94,411 మంది భక్తులు దర్శించుకున్నారు. 46,823 మంది శ్రీవారికి తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.41 కోట్ల రూపాయలు అని టీటీడీ అధికారులు చెప్పారు. ప్రస్తుతం దర్శనానికి 16 గంటల సమయం పడుతుంది. క్యూ లైన్లలో ఉన్న భక్తులందరికీ అన్నప్రసాదాలు, మంచినీటిని అందజేస్తున్నామని టీటీడీ అధికారులు చెప్పారు.


Tags:    

Similar News