అలిపిరి వద్ద బారులు తీరిన వాహనాలు
తిరుమలలో భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. గతంలో వీకెండ్ వరకే పరిమితమయిన రద్దీ ఇప్పుడు సాధారణ దినాల్లోనూ కొనసాగుతుంది
తిరుమలలో భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. గతంలో వీకెండ్ వరకే పరిమితమయిన రద్దీ ఇప్పుడు సాధారణ దినాల్లోనూ కొనసాగుతుంది. తాజాగా తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. పరీక్ష ఫలితాలు విడుదల కావడం, ఇతర రాష్ట్రాల నుంచి భక్తుల సంఖ్య అధికంగా వస్తుండటంతో రద్దీ పెరిగిందని టీటీడీ అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా టూరిస్ట్ లు తమ వాహనాలతో తిరుమలకు ఎక్కువగా చేరుకుంటున్నారు. దీంతో కూడా తిరుమలలో భక్తుల తాకిడి పెరిగింది.
సొంత వాహనాల్లో....
సొంత వాహనాల్లో వస్తుండటంతో అలిపిరి వద్దే గంటల సమయం గడచిపోతుంది. చెకింగ్ కోసం ఇక్కడ నిలిపివేస్తుండటంతో వందల సంఖ్యలో వాహనాలు అలిపిరి దాటేందుకు రెండు, మూడు గంటల సమయం పడుతుంది. ఈరోజు కూడా అలిపిరి వద్ద వాహనాల సంఖ్య ఎక్కువగా ఉంది. అలిపిరి తనిఖీ కేంద్రం నుంచి గోమందిరం వరకూ వాహనాలు నిలిచిపోయి ఉన్నాయి. వేసవి సెలవులు ముగిసినా భక్తుల రద్దీ ఎక్కువగా ఉందని, అయితే తిరుమలకు వచ్చిన ప్రతి భక్తుడికి దర్శన సౌకర్యం కల్పిస్తున్నామని టీటీడీ అధికారులు చెబుతున్నారు.