శ్రీవారిని దర్శించుకోవాలంటే?
తిరుమలలో భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం 26 కంపార్ట్‌మెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం 26 కంపార్ట్‌మెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. ప్రతి శని వారం నుంచి గురువారం వరకూ భక్తుల రద్దీ ఉంటుందని అధికారులు చెబుతున్నా మంగళవారం కూడా భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. స్వామి వారి దర్శనానికి ఏడు గంటల సమయం వరకూ పడుతుందని తిరుమల, తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు.
హుండీ ఆదాయం...
కాగా నిన్న శ్రీవారిని 74,228 భక్తులు దర్శించుకున్నారు. 36,473 మంది స్వామి వారికి తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.46 కోట్లు వచ్చింది. తిరుమలలో భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లను టీటీడీ అధికారులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కంపార్ట్‌మెంట్లలో ఉండే భక్తులకు మంచినీరు, అన్న ప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు.