శ్రీవారి దర్శనానికి సమయం?
తిరుమలలో భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. వేసవి సెలవుల అనంతరం కూడా భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది.
తిరుమలలో భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. వేసవి సెలవుల అనంతరం కూడా భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం 30 కంపార్ట్‌మెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి చూస్తున్నారు. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతుందని తిరుమల, తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు.
4.36 కోట్ల ఆదాయం...
నిన్న తిరుమల శ్రీవారిని 77,326 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం 4.36 కోట్ల రూపాయలుగా ఉంది. 38,742 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. ఆదివారం వరకూ తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగే అవకాశముందని టీటీడీ అధికారులు చెబుతున్నారు.