తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ

Update: 2022-11-13 02:43 GMT

 TirumalaTirupati

తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వరుస సెలవుల నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తిరుమలకు వస్తున్నారు. రెండు కాలినడక మార్గాలు, రోడ్డు మార్గాలలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో క్యూలైన్‌లు కిక్కిరిసిపోయాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్సు, నారాయణగిరి ఉద్యాన వనాలలో ఏర్పాటు చేసిన క్యూలైన్‌లు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. క్యూలైన్‌ గోగర్భండ్యామ్‌ సమీపం వరకు చేరుకుంది. టీటీడీ అధికారులు ఎప్పటికప్పుడు క్యూలైన్‌లో వేచివున్న భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, అల్పాహారం వంటివి శ్రీవారి సేవకుల సహాయంతో అందచేస్తున్నారు. అధిక రద్దీ కారణంగా సర్వదర్శనానికి 45 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. సర్వదర్శనానికి క్యూలైన్‌లోకి భక్తులను అనుమతించడం టీటీడీ తాత్కాలికంగా నిలిపివేసింది.

శనివారం శ్రీవారిని 73,323 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 41,041 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శనివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.20 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News