శ్రీవారి దర్శన సమయం...?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వీకెండ్ కావడంతో భక్తులు తిరుమలకు అధిక సంఖ్యలో వస్తున్నారు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వీకెండ్ కావడంతో భక్తులు తిరుమలకు అధిక సంఖ్యలో వస్తున్నారు. దీంతో కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయి భక్తులు స్వామి వారి దర్శనం కోేసం వేచి చూడాల్సి ఉంటుంది. ఈరోజు 26 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఏడు గంటల సమయం పడుతుందని తిరుమల, తిరుపతి అధికారులు చెబుతున్నారు.
ఈ నెలలో రికార్డు....
నిన్న తిరుమల శ్రీవారిని 78,479 మంది భక్తులు దర్శించుకున్నారు. 37,521 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.76 కోట్లు అని తిరుమల, తిరుపతి అధికారులు తెలిపారు. గత మే నెలలో 130 కోట్ల రికార్డు స్థాయి ఆదాయం శ్రీవారికి వచ్చింది. అయితే ఇప్పుడు 21 రోజులకే 100 కోట్ల ఆదాయం దాటడంతో ఆ రికార్డును బ్రేక్ చేసే అవకాశముందని చెబుతున్నారు.