రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న కొద్దిగా తగ్గిన భక్తుల రద్దీ ఈరోజు మళ్లీ పెరిగింది

Update: 2022-07-26 03:17 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న కొద్దిగా తగ్గిన భక్తుల రద్దీ ఈరోజు మళ్లీ పెరిగింది. ఈరోజు వైకుంఠం కాంప్లెక్స్ లోని 13 కంపార్ట్‌మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి ఏడు గంటల సయమం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. భక్తుల రద్దీ ఈ వారంలో మరింత పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని, వసతి, దర్శనానికి ఇబ్బంది లేకుండా చూస్తున్నామని అధికారులు చెబుతున్నారు.

రష్ పెరుగుతుంది....
ఇక నిన్న తిరుమల శ్రీవారిని 72,873 మంది భక్తులు దర్శించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. వీరిలో 32,641 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి ఆదాయం 5.12 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు. చాలా రోజుల తర్వాత రోజుకు ఐదుకోట్ల రూపాయలు దాటిందని తిరుమల తిరుపతి అధికారులు చెప్పారు. ఈరోజు నుంచి ఆదివారం వరకూ భక్తులు మరింత మంది వచ్చే అవకాశముంది.


Tags:    

Similar News