తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. వైకుంఠం కాంప్లెక్స్ లోని 18 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి
తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. వైకుంఠం కాంప్లెక్స్ లోని 18 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. శ్రీవారి దర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. భక్తులకు అవసరమైన మంచినీరు, అన్న ప్రసాదాలను క్యూ లైన్లలోనే అందిస్తున్నామని అధికారులు తెలిపారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
హుండీ ఆదాయం....
ఇక నిన్న తిరుమల శ్రీవారిని 68,982 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,092 మంది భక్తులు తలనీలాలను సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.60 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. మరో నాలుగైదు రోజుల పాటు ఈ రద్దీ కొనసాగే అవకాశముందని, ఎంతమంది భక్తులు వచ్చినా వసతి, అన్నప్రసాదాలకు ఇబ్బంది పడకుండా చూస్తామని అధికారులు తెలిపారు.