తిరుమలలో తగ్గని భక్తుల రద్దీ

తిరుమలలో భక్తలు రద్దీ తగ్గడం లేదు. వరస సెలవులు వస్తుండంతో తిరుమలకు భక్తుల రద్దీ పెరుగుతుంది

Update: 2022-08-11 03:19 GMT

తిరుమలలో భక్తులు రద్దీ తగ్గడం లేదు. వరస సెలవులు వస్తుండంతో తిరుమలకు భక్తుల రద్దీ పెరుగుతుంది. వైకుంఠం కాంప్లెక్స్ లోని 16 కంపార్ట్‌మెంట్లలో శ్రీవారి దర్శనం కోసం భక్తుల వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి15 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. ఆదివారం వరకూ ఇదే రద్దీ కొనసాగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవ్వడంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు అవసరమైన వసతి సౌకర్యాలను కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నారు.

ఐదు కోట్లు....
నిన్న తిరుమల శ్రీవారిని 74,497 మంది భక్తులు దర్శించుకున్నారు. 36,244 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 5.15 కోట్లు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News