కంపార్ట్‌మెంట్లన్నీ నిండి.. క్యూలైన్
ితిరుమలలో భక్తుల రద్దీ తగ్గడం లేదు. క్యూలైన్లు వైకుంఠం కాంప్లెక్స్ దాటి కొనసాగుతున్నాయి.
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గడం లేదు. క్యూలైన్లు వైకుంఠం కాంప్లెక్స్ దాటి కొనసాగుతున్నాయి. ప్రస్తుతం క్యూలైన్ కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయి టీబీసీ వరకూ చేరుకుంది. దీంతో తిరుమల శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఇక మరో మూడు రోజుల పాటు భక్తులు రద్దీ కొనసాగే అవకాశముంది. వీకెండ్ కావడంతో భక్తుల రద్దీ మరింత పెరుగుతుంది.
హుండీ ఆదాయం...
నిన్న తిరుమల శ్రీవారిని 74,304 మంది భక్తులు దర్శించుకున్నారు. 31,880 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 5.45 కోట్లు వచ్చిందని అధికారులు వెల్లడించారు. భక్తులు ఎంత మంది వచ్చినా తగిన సౌకర్యాలు కల్పిస్తామని టీటీడీ అధికారులు చెబుతున్నారు.