తిరుమలలో తగ్గని భక్తుల రద్దీ
తిరుమలతో భక్తుల రద్దీ తగ్గడం లేదు. వేసవి సెలవులు కావడంతో భక్తులు రద్దీ గత కొద్ది రోజుల నుంచి బాగా పెరిగింది
తిరుమలతో భక్తుల రద్దీ తగ్గడం లేదు. వేసవి సెలవులు కావడంతో భక్తులు రద్దీ గత కొద్ది రోజుల నుంచి బాగా పెరిగింది. టీటీడీ సయితం సౌకర్యాలను సమకూర్చలేక సతమతమవుతుంది. పదో తరగతి పరీక్ష ఫలితాలు కూడా రావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశముంది. నిన్న తిరుమల శ్రీవారిని 76,425 మంది భక్తులు దర్శించారు.
హుండీ ఆదాయం....
36,0053 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి 4.15 కోట్లు ఆదాయం అలభించింది. 27 కంపార్ట్ మెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతుంది.