Breaking : ఇద్దరు టీడీపీ సభ్యుల సస్పెన్షన్

సభలో వీడియో తీసుకున్నందుకు ఇద్దరిపై స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెన్షన్ వేటు వేశారు;

Update: 2023-09-22 04:32 GMT
achennaidu, ashok, tdp, suspension
  • whatsapp icon

సభ ప్రారంభం కాగానే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు తమ ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. సభలో వీడియో తీసుకున్నందుకు ఇద్దరిపై స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెన్షన్ వేటు వేశారు. ఈ సమావేశాలు మొత్తానికి అచ్చెన్నాయుడు, బెందాల అశోక్‌ను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

విజిల్ వేసిన బాలకృష్ణ...
సభలో వీడియో తీయడం నిషిద్ధమని చెబుతున్నా వారు తీసేందుకు ప్రయత్నించడంతో ఈ చర్యలు తీసుకున్నారు. వీరిద్దరూ సభ నుంచి వెళ్లి పోవాలంటూ స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే నందమూరి బాలకృష్ణ మాత్రం విజిల్ వేస్తూ తన నిరసన తెలియచేశారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమమంటూ సభలో టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే.


Tags:    

Similar News