బీజేపీ, జనసేన కలసి పోటీ చేస్తాయి
వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలసి పోట ీచేస్తాయని రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు;
వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలసి పోట ీచేస్తాయని రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. గుంటూరులో బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో జరుగుతున్న 48 గంటల నిరసన దీక్షా శిబిరంలో ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి బీజేపీ, జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పనితీరుపై ప్రజలు తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నాని సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు.
పొత్తులకు మేం ప్రయత్నించడం లేదు...
త్వరలో బీజేపీ పది వేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తుందని సోము వీర్రాజు ఈ సందర్భంగా తెలిపారు. తాము అన్ని వర్గాలను కలుపుకుని వెళతామని చెప్పారు. పొత్తుల కోసం తాము ఎన్నడూ పాకులాడలేదని, వారే మాతో పొత్తు కోసం పరితపించి పోతున్నారని సోము వీర్రాజు అన్నారు. అబద్దాలు చెప్పే వాళ్లు ఎప్పటికీ రాజకీయాల్లో నిలువలేరని అన్నారు.