లోకేష్ పాదయాత్రకు బ్రేక్...? కారణమిదే
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర కొనసాగింపుపై ఉత్కంఠ కొనసాగుతుంది
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర కొనసాగింపుపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. లోకేష్ పాదయాత్ర విషయంలో స్పష్టత ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాని అధికారికి చిత్తూరు జిల్లా కలెక్టర్ లేఖ రాశారు. అక్కడి నుంచి సమాచారం అందిన వెంటనే లోకేష్ పాదయాత్రకు అనుమతివ్వాలని అధికారులు యోచిస్తున్నారు.
ఎన్నికల కోడ్...
పాదయాత్ర ఎన్నికల ప్రవర్తన నియమావళి పరిధిలోకి వస్తుందో? లేదో? చెప్పాలని ఎన్నికల అధికారిని కోరినట్లు అధికారులు వెల్లడించారు. మార్చి 13న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో చిత్తూరు జిల్లా అంతటా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందన్నారు. ప్రస్తుతం నారా లోకేష్ ప్రస్తుతం చిత్తూరు జిల్లాలోని జీడీ నెల్లూరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. లోకేష్ పర్యటనతో పాటు గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమానికి కూడా అనుమతిచ్చే విషయంలో స్పష్టత ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని కలెక్టర్ కోరారు.