గోవింద నామస్మరణతో మార్మోగుతున్న తిరుమల
తిరుమలలో స్వామి వారి గరుడ సేవ ప్రారంభమయింది. నాలుగు మాడ వీధుల్లోనూ భక్త జనం స్వామి వారిని దర్శించుకుని తరించిపోతున్నారు
తిరుమలలో స్వామి వారి గరుడ సేవ ప్రారంభమయింది. నాలుగు మాడ వీధుల్లోనూ భక్త జనం స్వామి వారిని దర్శించుకుని తరించిపోతున్నారు. తిరుమల కొండలు గోవింద నామస్మరణలతో మారుమోగుతున్నాయి. గరుడ వాహన సేవను చూసేందుకు లక్షల సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు. గత రెండేళ్ల నుంచి కరోనా కారణంగా ఈ అవకాశం దక్కకపోవడంతో అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. రాత్రి ౯ గంటల వరకూ ఈ గరుడ వాహన సేవ కొనసాగుతుంది. నాలుగు మాడ వీధుల్లోనూ స్వామి వారు విహరిస్తారు.
లక్షల మంది తరలి రావడంతో...
దీంతో గరుడ సేవకు ఐదు వేల మంది పోలీసులతో భద్రత కల్పించారు. ఎక్కడా తొక్కిసలాట జరగకుండా టీటీడీ ముందస్తు చర్యలు చేపట్టింది. అంచనాకు మించి భక్తులు కొండకు తరలి రావడంతో వారిని కంట్రోల్ చేయడం కూడా పోలీసుల వల్ల కావడం లేదు. స్వామిని చూసేందుకు బారికేడ్లను తోసుకుని ముందుకు వస్తుండటంతో పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. పట్టువస్త్రాలు, నలభై లక్షల విలువైన ఆభరణాలతో మలయప్ప స్వామిని అలంకరించారు.