మెడలు వంచుతానని .. దించాడు

టీడీపీ అధినేత చంద్రబాబు భద్రాచలంలో పర్యటించారు. తొలుత భద్రాద్రి రాముడిని దర్వించుకని అర్చకుల నుంచి ఆశీర్వచనాలు పొందారు

Update: 2022-07-29 07:59 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు భద్రాచలంలో పర్యటించారు. తొలుత భద్రాద్రి రాముడిని దర్వించుకని అర్చకుల నుంచి ఆశీర్వచనాలు పొందారు. విలీన మండలాల్లో ఆయన పర్యటించారు. అనంతరం ఆయన వరద బాధితులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కనీసం ఇక్కడ పర్యటించడానికి కూడా భయపడిపోతున్నారన్నారు. నాలుగు టమాటాలు, నాలుగు ఉల్లిగడ్డలు ఇచ్చి ఇదే సాయమన్నాడని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఈ ముఖ్యమంత్రికి నీతి నిజాయితీ, సమాజం పట్ల అవగాహన లేదన్నారు. 25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తానని చెప్పిన జగన్ ఇప్పుడు ఏం చేశాడని చంద్రబాబు ప్రశ్నించారు.

జిల్లాను ఏర్పాటు చేస్తా..
మెడలు వంచాలని చెప్పి, మెడలు దించాడన్నారు. పోలవరం జిల్లాను ఏర్పాటు చేస్తానని, ముంపు మండలాల ప్రజలకు అండగా ఉంటానని చంద్రబాబు భరోసా ఇచ్చారు. పోలవరం కోసం త్యాగాలు చేసిన రైతుల కుటుంబాల్లో వెలుగులు నింపుతానని చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధి తన హయాంలోనే జరిగిందని చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతిని రాజధాని చేద్దామని చేసిన ప్రయత్నాన్ని జగన్ సర్వనాశనం చేశాడన్నారు. వైసీపీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా పోరాడాలని పిలుపునిచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కూడా ఈ వైసీపీ నేతలు ఎటువంటి పోరాటాలు చేయడం లేదన్నారు.


Tags:    

Similar News