TDP: టీడీపీలో విబేధాలు.. ఆ నియోజకవర్గంతో చంద్రన్నకు తలనొప్పి

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయం మరింతగా వేడెక్కుతోంది. ఎవరికి వారు పవులు కదుపుతున్నారు.

Update: 2024-03-06 09:58 GMT

TDP

TDP:ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయం మరింతగా వేడెక్కుతోంది. ఎవరికి వారు పవులు కదుపుతున్నారు. ఎలాగైనా ఈ సారి అధికారంలోకి రావాలని టీడీపీ ఉవ్విళ్లూరుతోంది. ఇతర పార్టీలలో ఉన్న నేతలను పచ్చ పార్టీలోకి లాగేందుకు గాలం వేస్తున్నారు. ఇక వసంతకృష్ణ ప్రసాద్, దేవినేని ఉమా, బొమ్మసాని సుబ్బారావు.. ముగ్గురు నేతల మెడలో పసుపు కండువా ఉన్నా ముగ్గురు నేతల తీరు మైలవరం నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లకు అంతుపట్టడం లేదు. ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ బీఫామ్ అందుకునేది ఎవరు? ఒకరికి టికెట్ లభిస్తే మిగతా ఇద్దరు సహకరిస్తారా? లేదా అన్నది సైకిల్‌ పార్టీలో చర్చనీయాంశంగా మాఇంది. మారింది. టికెట్‌ తనకే అని ఆశలు పెట్టుకున్న వసంత కృష్ణప్రసాద్ బొమ్మసాని సుబ్బారావుతో భేటీ అయ్యారు. త్వరలో దేవినేనితోనూ భేటీ అవుతానని నేతలు చెబుతున్నారు.

అయితే బొమ్మసాని మాత్రం మైలవరంలో వసంత కృష్ణ ప్రసాద్‌ను టీడీపీ కార్యకర్తలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదని అంటున్నారు. ఆయన పెనమలూరుకు వెళ్లడం మంచిదని మా ఇద్దరి మధ్య భేటీలో సూచించానని అంటున్నారు.

ఇక మడకశిరలో సునీల్ కుమార్‌కు టికెట్ ఇవ్వడంపై తిప్పస్వామి వర్గం ఏకంగా ఆత్మహత్యల వరకు వెళ్లడంతో మరింత టెన్షన్‌ మొదలైంది .టికెట్ సునీల్ కుమార్‌కు ఇవ్వడంతో తిప్పేస్వామి అనుచరులు మండిపడుతున్నారు. ఈ రోజు పెద్ద ఎత్తున ఆయన ఇంటికి చేరుకొని అభ్యర్థిని మార్చాలంటూ డిమాండ్ చేశారు. తిప్పేస్వామికి అన్యాయం చేశారని ఓ కార్యకర్త ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.అయితే సునీల్ కుమార్ వర్షన్ మాత్రం మరోలా ఉంది. సర్వేల ఆధారంగానే తనకు టికెట్ ఇచ్చారంటున్న సునీల్ కుమార్.. తిప్పేస్వామితోనూ తాను మాట్లాడుతామని అంటున్నారు.

Tags:    

Similar News