ఉరవకొండలోకి నారా లోకేష్
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేటికి 61వ రోజుకు చేరుకుంది. ఈరోజు ఉరవకొండ నియోజకవర్గంలో జరుగుతుంది
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేటికి 61వ రోజుకు చేరుకుంది. ఈరోజు ఉరవకొండ నియోజకవర్గంలో జరుగుతుంది. ఇప్పటి వరకూ లోకేష్ 73.9 కి.మీ. దూరం నడించారు. ఉదయం 8 గంటలకు పిల్లిగుండ్ల ఎంవైఆర్ కళ్యాణ మండపం క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. 8.30 గంటలకు పాదయత్ర ఉరవకొండ నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది.
వరస భేటీలతో...
ఉదయం 9.10 గంటలకు గొట్కూరులో స్థానికులతో మాటామంతీ కార్యక్రమంలో లోకేష్ పాల్గొంటారు. 9.50 గంటలకు మణిపాల్ స్కూల్ వద్ద గ్రామస్తులతో సమావేశమవుతారు. 10.05 గంటలకు బ్రాహ్మణపల్లి వద్ద యాదవ సామాజికవర్గీయులతో భేటీ అవుతారు. 10.20 గంటలకు రామచంద్రపురం క్రాస్ వద్ద స్థానికులతో మాటామంతీ కార్యక్రమంలో లోకేష్ పాల్గొంటారు. 11.25 గంటలకు కమ్మూరులో భోజన విరామానికి ఆగుతారు. మధ్యాహ్నం 2.30 గంటలకు కమ్మూరు నుంచి పాదయాత్ర కొనసాగి సాయంత్రం 4.30 గంటలకు కూడేరు బహిరంగసభలో లోకేష్ ప్రసంగించనున్నారు. రాత్రికి కూడేరులో లోకేష్ బస చేయనున్నారు.