నేడు యువగళం యాత్ర ఇలా
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేటికి 81వ రోజుకు చేరుకుంది.
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేటికి 81వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకు లోకేష్ 1030.6 కిలో మీటర్ల దూరం నడిచారు. ఈరోజు కూడా మంత్రాలయం నియోజకవర్గంలో పాదయాత్ర జరగనుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈరోజు ఉదయం 7 గంటలకు కోసిగి శివారు నుంచి పాదయాత్ర ప్రారంభమయింది. ఉదయం 9గంటలకు డి.బెళగళ్ పంచాయితీ దొడ్డిలో స్థానికులతో సమావేశం అయ్యారు.
నేటి బస...
ఉదయం 9.25 గంటలకు డి.బెళగల్ లో విఆర్ఓలతో సమావేశంలో పాల్గొన్నారు. 9.50 గంటకు పల్లెపాడు క్రాస్ వద్ద స్థానికులతో సమావేశమమయ్యారు. 11.00 గంటలకు గురురాఘవేంద్ర ప్రాజెక్టు క్రాస్ వద్ద మాటామంతీ కార్యక్రమంలో లోకేష్ పాల్గొంటారు. 12.05 గంటలకు లచ్చుమర్రి క్రాస్ సమీపంలో రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు మధ్యాహ్నం 1.05 గంటలకు లచ్చుమర్రి క్రాస్ వద్ద భోజన విరామానికి ఆగుతారు. తిరిగి సాయంత్రం 4 గంటలకు పాదయాత్ర ప్రారంభమవుతుంది. సాయంత్రం 5.00 గంటలకు లచ్చుమర్రిలో ఈ-సేవ ఉద్యోగులతో సమావేశమవుతారు. 6.40 గంటలకు మాధవరం శివారులో బస చేస్తారు.