52వ రోజు లోకేష్ పాదయాత్ర
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేడు పెనుగొండ నియోజకవర్గంలో జరగనుంది.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేడు పెనుగొండ నియోజకవర్గంలో జరగనుంది. ఇప్పటి వరకూ లోకేష్ 650 కిలోమీటర్ల దూరం నడిచారు. లోకేష్ పాదయాత్ర ప్రారంభించి నేటికి 52వ రోజుకు చేరుకుంది. నేటి ఉదయం కొండాపురం పంచాయతీ చెరువుకట్ట నుంచి బయలుదేరి 9.15 గంటలకు స్థానికులతో సమావేశమై సమస్యలను అడిగి తెలుసుకుంటారు. అనంతరం 10.15 గంటలకు చలమయ్యగారిపల్లిలో వడ్డెర సామాజికవర్గం ప్రజలతో సమావేశమై వారితో సమస్యలపై చర్చిస్తారు.
నాయీబ్రాహ్మణులతో...
ఉదయం 11.15 గంటలకు జీనబండ్లపల్లిలో నాయీబ్రాహ్మణులతో ఆయన సమావేశమై తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఏమేమి ప్రయోజనాలు కల్పిస్తారో చెప్పనున్నారు. 12.10 గంటలకు తిప్పరాజు పల్లిలో భోజన విరామానికి ఆగుతారు. అనంతరం పాదయాత్ర ప్రారంభమై గోరంట్లలో స్థానికులతో సమావేశమవుతారు. తదనంతరం గోరంట్ల ఆర్టీసీ సర్కిల్ వద్ద స్థానికులతో మాట్లాడతారు. అనంతరం గుమ్మయ్యగారి పల్లి వద్ద జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రాత్రికి గుమయ్యగారిపల్లిలో బస చేయనున్నారు. లోకేష్ పాదయాత్రకు పార్టీ నేతలు విస్తృత ఏర్పాట్లు చేశారు.