నారా లోకేష్ @ 800 కిలోమీటర్లు
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర శింగనమల నియోజకవరర్గంలో జరుగుతుంది
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర శింగనమల నియోజకవరర్గంలో జరుగుతుంది. ఈరోజు పాదయాత్ర 63వ రోజుకు చేరుకుంది. ఉదయం ఎనిమిది గంటలకు పాదయాత్ర ప్రారంభమవుతుంది. మర్తాడు కెనాల్ వద్ద ఎనిమిది వందల కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా లోకేష్ శిలా ఫలకాలన్ని ఆవిష్కరించనున్నారు.
శింగనమల నియోజకవర్గంలో...
8.55 గంటలకు మర్తాడు కెనాల్ వద్ద స్థానికులతో సమస్యలపై లోకేష్ చర్చించనున్నారు. 10.20 గంటలకు బూదేడు క్రాస్ వద్ద స్థానికులతో మాటామంతీ కార్యక్రమంలో పాల్గొంటారు. 10.55 గంటలకు గార్లదిన్నెలో భోజన విరామానికి ఆగుతారు. అనంతరం 3.15 గంటలకు డ్యామ్ రోడ్డు సర్కిల్ నుంచి స్థానికులతో సమావేశమవుతారు. అనంతరం 3.50 గంటలకు గార్లదిన్నెలో బహిరంగ సభలో లోకేష్ ప్రసంగిస్తారు. అనంతరం రాత్రికి జంబులదిన్నె వద్ద రాత్రి బస చేయనున్నారు.