శింగనమలలోకి లోకేష్
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేడు శింగనమల నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేటికి 62వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకు లోకేష్ 789.9 కి.మీ దూరం నడిచారు. నేడు పాదయాత్ర శింగనమల అసెంబ్లీ నియోజకవర్గం పాదయాత్ర జరగనుంది. ఉదయం 8గంటలకు కూడేరు బస నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. 8.15 గంటలకు సంగమేష్ కాలనీలో స్థానికులతో లోకేష్ మాటామంతీ జరుపుతారు.
పాదయాత్ర ఇలా...
ఉదయం 9.35గంటలకు అరవకూరులో గ్రామస్తులతో లోకేష్ సమావేశం కానున్నారు. 11.45 గంటలకు కమ్మూరు శివార్లలో బీసీ సామాజికవర్గీయులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. 12.45 గంటలకు కమ్మూరు శివార్లలో భోజన విరామానికి ఆగుతారు. సాయంత్రం 3.45 గంటలరే కమ్మూరు శివారు నుంచి పాదయాత్ర తిరిగి కొనసాగిస్తారు. సాయంత్రం 4.15 గంటలకు పాదయాత్ర శింగనమల నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది, కోటంక వద్ద స్థానికులతో మాటామంతీ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు కోటంక గండి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. అనంతరం రాత్రి 7.30 గంటలకు మార్తాడు వద్ద బస చేయనున్నారు.