యువగళం @ 1200 కిమీ
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేడు నందికొట్కూరు నియోజకవర్గంలోకి ప్రవేశించింది
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేడు నందికొట్కూరు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఇప్పటి వరకూ నారా లోకేష్ 1189 కిలోమీటర్ల దూరం నడిచారు. యువగళం పాదయాత్ర నేటికి 95వ రోజుకు చేరుకుంది. ఉదయం 7 గంటలకు గార్గేయపురం నుంచి పాదయాత్ర ప్రారంభమయింది. 8.10 గంటలకు నందికొట్కూరు నియోజకవర్గంలో ప్రవేశించింది. 8.15గంటలకు బ్రాహ్మణకొట్కూరులో లోకేష్ ఎస్సీలతో సమావేశం లో పాల్గొన్నారు. 8.40 గంటలకు బ్రాహ్మణకొట్కూరు శివాలయం వద్ద ముస్లింలతో సమావేశమయ్యారు. 9గంటలకు కోళ్లబోవపురం క్రాస్ వద్ద ఎస్టీలతో సమావేశం అయ్యారు.
నందికొట్కూరు నియోజకవర్గంలో...
9.40గంటలకు వడ్డెమూరులో బోయలతో లోకేష్ సమావేశం కానున్నారు. 10గంటలకు కోనేటమ్మపల్లి క్రాస్ వద్ద సర్పంచ్ లతో సమావేమవుతారు. 10.40 గంటలకు అల్లూరులో గోళ్ల సామాజికవర్గీయులతో సమావేశమై వారి సమస్యలపై చర్చించనున్నారు. 11.10 గంటలకు అల్లూరులో 1200 కి.మీ. పాదయాత్ర చేరుకుంటుంది. ఈ సందర్భంగా అక్కడ శిలాఫలకాన్ని లోకేష్ ఆవిష్కరించనున్నారు.
వివిధ వర్గాలతో...
ఉదయం11.25 గంటలకు అల్లూరు శివార్లలో భోజనవిరామానికి ఆగుతారు. సాయంత్రం 4గంటలకు అల్లూరు శివార్లనుంచి పాదయాత్ర తిరిగి ప్రారంభం కానుంది. 5.30 గంటలకు– నందికొట్కూరులోని ఎన్ఎస్ ఫంక్షన్ హాలువద్ద బహిరంగసభలో లోకేష్ ప్రసంగించనున్నారు. 6.45 గంటలకు మార్కెట్ యార్డు సర్కిల్ లో రైతులతో సమావేశం కానున్నారు. 7.10 గంటలకు సుంకాలమ్మ దేవాలయం వద్ద డ్రైవర్స్ యూనియన్ ప్రతినిధులతో లోకేష్ సమావేశమై వారి సమస్యల పరిష్కారానికి తగిన హామీలు ఇవ్వనున్నారు. 7.25 గంటలకు పటేల్ సెంటర్ లో గౌడ సామాజికర్గీయులతో సమావేశం కానున్నారు. 7.55 గంటలకు నందికొట్కూరు శివారులో బస చేయనున్నారు.