నేడు కూడా నందికొట్కూరులోనే
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేటికి 96వ రోజుకు చేరుకుంది
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేటికి 96వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం లోకేష్ పాదయాత్ర నందికొట్కూరు నియోజకవర్గంలో జరుగుతుంది. ఇప్పటి వరకూ లోకేష్ 1206 కిలోమీటర్ల దూరం నడిచారు. ఈరోజు నందికొట్కూరు శివారు నుంచి పాదయాత్ర ప్రారంభమయింది. 8.30 గంటలకు తార్టూరు క్రాస్ వద్ద గ్రామస్తులతో సమావేశం కానున్నారు. 8.50 గంటలకు మండ్లెం గ్రామంలో స్థానికులతో సమావేశం అవుతారు. 10.15 గంటలకు తంగడంచ గ్రామంలో స్థానికులతో సమావేశమై సమస్యలపై చర్చిస్తారు.
96వ రోజుకు....
10.55 గంటలకు తంగడంచలో బిసి సామాజిక వర్గీయులతో ముఖాముఖి కార్యక్రమంలో లోకేష్ పాల్గొంటారు. 11.55 గంటలకు తంగడంచలో భోజన విరామానికి ఆగుతారు. సాయంత్రం నాలుగు గంటలకు తంగడంచ నుంచి పాదయాత్ర కొనసాగిస్తారు. 4.20 గంటలకు జూపాడుబంగ్లాలో తాండవ సామాజికవర్గీయులతో సమావేశం అవుతారు. 4.50 గంటలకు ఎబిఎన్ చర్చిలో క్రిస్టియన్లతో సమావేశం అవుతారు. 5.10 గంటలకు తాటిపాడు క్రాస్ వద్ద రైతులతో సమావేశం అవుతారు. 5.50 గంటలకు తరిగొప్పుల క్రాస్ వద్ద బిసిలతో సమావేశం అవుతారు. 6.15 గంటలకు బన్నూరు వద్ద స్థానికులతో సమావేశమైన తర్వాత అక్కడే రాత్రికి బస చేయనున్నారు.