రాప్తాడులో లోకేష్
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేడు రాప్తాడు నియోజకవర్గంలో జరగనుంది
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేడు రాప్తాడు నియోజకవర్గంలో జరగనుంది. ఇప్పటి వరకు 706.9 కి.లోమీటర్ల దూరం లోకేష్ నడిచారు. లోకేష్ పాదయాత్ర 56వరోజుకు చేరుకుంది. రాప్తాడు అసెంబ్లీ – సికె పల్లి పంచాయితీ కోన క్రాస్ నుంచి పాదయాత్ర కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఉదయం 9 గంటలకు సికె పల్లిలో వెంకటంపల్లి గ్రామస్థులతో లోకేష్ సమావేశం కానున్నారు. 9.25 గంటలకు సికె పల్లి బిసికాలనీలో బిసి సామాజిక వర్గీయులతో భేటీ కానున్నారు.
పర్యటన ఇలా...
ఉదయం 10.20 గంటలకు యర్రంపల్లిలో జాకీ ఫ్యాక్టరీ బాధితులతో లోకేష్ సమావేశం కానున్నారు. ఉదయం 11గంటలకు నాగసముద్రం క్రాస్ వద్ద స్థానికులతో మాటామంతీ కార్యక్రమంలో పాల్గొంటారు. 11.50 గంటలకు నాగసముద్రం గేట్ వద్ద ఆటోడ్రైవర్లు, మెకానిక్ లతో సమావేశమవుతారు. 12.45 గంటలకు నాగసముద్రంలో స్థానికులతో భేటీ ఉంటుంది. మధ్యాహ్నం 1.40 గంటలకు బసినేపల్లి క్రాస్ వద్ద భోజన విరామం కోసం ఆగుతారు. అనంతరం పాదయాత్ర ప్రారంభమై సాయంత్రం 4.35 గంటలకు ఉప్పరవాండ్ల కొట్టాలు క్రాస్ వద్ద సత్యసాయి వర్కర్లతో సమావేశం కానున్నారు. సాయంత్రం ఐదు గంటలకు పైదిండి సమీపంలో బహిరంగసభ లో ప్రసంగించనున్నారు. రాత్రికి పైదిండి శివార్లలో రాత్రి బస చేయనున్నారు.