ఎమ్మిగనూరులోకి లోకేష్
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేడు ఎమ్మిగనూరు నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేడు ఎమ్మిగనూరు నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది. ఇప్పటి వరకు లోకేష్ 1059.7 కిలో మీటర్ల దూరం నడిచారు. యువగళం పాదయాత్ర నేటికి 83వ రోజుకు చేరుకుంది. ఉదయం ఏడు గంటలకు మంత్రాలయం శివార్ల నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. .30 గంటలకు కల్లుదేవకుంటలో రైతులతో లోకేష్ భేటీ కానున్నారు. 8.20 గంటలకు ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశిస్తారు. 9.10 గంటలకు ఇబ్రహీంపట్నం చర్చి వద్ద స్థానికులతో సమావేశమై వారి సమస్యలపై లోకేష్ చర్చిస్తారు. 9.20 గంటలకు ఇబ్రహీంపట్నం గ్రామచావిడి వద్ద స్థానికులతో భేటీ అవుతారు. 9.55 గంటలకు కొట్టాల క్రాస్ వద్ద నడికైరవాడ గ్రామస్తులతో సమావేశం కానున్నారు.10.45 గంటలకు మాచాపురం శివార్లలో రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు.
యువగళం ఇలా....
11.45 గంటలకు మాచాపురం శివార్లలో భోజన విరామానికి లోకేష్ ఆగుతారు. సాయంత్రం4.00 తిరిగి పాదయాత్ర ప్రారంభం కానుంది. 4.45 గంటలకు మాచాపురంలో స్థానికులతో మాటామంతీ కార్యక్రమంలో పాల్గొంటారు. 4.55 గంటలకు మాచాపురం పంచాయితీ ఆఫీసు వద్ద ఎస్సీలతో భేటీ కానున్నారు. .5.05 గంటలకు మాచాపురం ఆటోస్టాండ్ వద్ద స్థానికులతో సమావేశం అవుతారు. అనంతరం 5.30 గంటలకు మాచాపురం శివార్లలోఎస్సీ,బిసిసామాజికవర్గీయులతో భేటీ అవుతారు. సాయంత్రం 6.20 గంటలకు నందవరం ఎస్సీ కాలనీలో దళితులతో సమావేశం కానున్నారు. 6.35 గంటలకు నందవరం చర్చి వద్ద స్థానికులతో సమావేశం అవుతారు. రాత్రికి నందవరం శివారులో లోకేష్ బస చేయనున్నారు.