నేడు పాణ్యంలోకి లోకేష్
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేడు పాణ్యం నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేడు పాణ్యం నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది. ఇప్పటి వరకూ లోకేష్ 1119.7 కిలోమీటర్ల దూరం నడిచారు. నేడు కూడా కోడుమూరు నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర జరగనుంది. ఉదయం ఏడు గంటలకు పాదయాత్రకు బయలుదేరిన నారా లోకేష్ కోడుమూరు హంపయ్య సర్కిల్‌లో బుడగజంగాలతో భేటీ అయ్యారు.
సమావేశాలతో...
ఉదయం 7.35 గంటలకు కోడుమూరు కోట్ల సర్కిల్ లో సర్పంచ్ లతో సమావేశంలో లోకేష్ పాల్గొన్నారు. 10.15 గంటలకు వెంకటగిరి గ్రామస్తులతో మాటామంతీ కార్యక్రమంలో పాల్గొంటారు. 11.20 గంటలకు వెంకటగిరిలో ఎస్సీ సామాజికవర్గీయులతో ముఖాముఖి కార్యక్రమంలో లోకేష్ పాల్గొంటారు. 12.20 గంటలకు వెంకటగిరిలోభోజన విరామానికి ఆగుతారు.
రేమండూరులో బస....
అనంతరం సాయంత్రం 4గంటలకు పాదయాత్ర ప్రారంభమవుతుంది. 4.45 గంటలకు చిలబండ క్రాస్ వద్ద స్థానికులతో మాటామంతీ కార్యక్రమంలో పాల్గొంటారు. 5.20 గంటలకు యర్రదొడ్డి గ్రామస్తులతో లోకేష్ సమావేశం అవుతారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. సాయంత్ర .6.10 గంటలకు అనుగొండ గ్రామస్తులతో సమావేశంలో పాల్గొననున్నారు. 6.30 గంటలకు పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గంలోకి లోకేష్ పాదయాత్ర ప్రవేశిస్తుంది. రాత్రికి రేమండూరు లోకేష్ బస చేయనున్నారు.