నారా లోకేష్ యువగళం @ 700 కి.మీ

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేడు రాప్తాడు నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది

Update: 2023-03-30 04:25 GMT

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేడు రాప్తాడు నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది. 55వ రోజుకు చేరుకున్న పాదయాత్ర నేడు 700 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఇందుకు గుర్తుగా గుట్టూరులో లోకేష్ శిలాఫలకాన్ని ఆవిష్కరించనున్నారు. పెనుకొండ సమీపంలోని రాత్రి బస నుంచి బయలుదేరిన పాదయాత్ర లోకేష్ హరిపురం గ్రామస్థులతో సమావేశమయ్యారు. 9.35 గంటలకు ఎర్రమంచి వద్ద కియా కార్ల పరిశ్రమల ఉద్యోగులతో లోకేష్ ముఖాముఖి సమావేశం కానున్నారు.

రాప్తాడు లోకి పాదయాత్ర...
ఉదయం 10.30 గంటలకు అమ్మవారిపల్లిలో స్థానికులతో భేటీ కానున్నారు. అనంతరం 11.10 గంటలకు యువగళం పాదయాత్ర 700 కిలోమీటర్లకు చేరుకోవడంతో గుట్టూరు వద్ద శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు గుట్టూరు రహదారి పక్కన వక్కలిగ సామాజికవర్గీయులతో సమావేశంలో పాల్గొంటారు. ఒంటిగంటకు అక్కడే భోజనం చేస్తారు. అనంతరం రెండు గంటలకు తిరిగి పాదయాత్రను ప్రారంబించి రాప్తాడు నియోజకవర్గంలోకి ప్రవేశిస్తారు. రాప్తాడు నియోజకవర్గంలోని చెన్నే కొత్తపల్లి మండలంలోకి పాదయాత్ర ప్రవేశిస్తుంది. అక్కడ స్థానికులతో సమావేశమవుతారు. రాత్రికి కోనమలుపు వద్ద బస చేయనున్నారు.


Tags:    

Similar News