నేడు తంబళ్లపల్లి నియోజకవర్గంలో లోకేష్
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేడు తంబళ్లపల్లి నియోజకవర్గంలోకి ప్రవేశంచనుంది
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేడు తంబళ్లపల్లి నియోజకవర్గంలోకి ప్రవేశంచనుంది. నేడు లోకేష్ పాదయాత్ర 40వ రోజుకు చేరుకుంది. లోకేష్ ఇప్పటి వరకూ 510.5 కిలోమీటర్లు నడిచారు. ఈరోజు ఉదయం 9 గంటలకు మదనపల్లి రూరల్ దేవతానగర్ క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అనంతరం మదనపల్లిలోని ఆరో వార్డులో స్థానికులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. అనంతరం 9,50 గంటలకు బర్మా సర్కిల్ లోనూ స్థానికులతో భేటీ అవుతారు.
బహిరంగ సభలో....
ఉదయం 10.15 గంటలకు టౌన్ బ్యాంకు సర్కిర్ లో విశ్వబ్రాహ్మణుల సామాజికవర్గం ప్రజలతో సమావేశమవుతారు. అనంతరం బెంగళూరు బస్టాండ్ లో ముస్లిం పెద్దలతో సమావేశమవుతారు. 11.25 గంటలకు ఎన్టీఆర్ సర్కిల్ లో స్థానికులతో మాటా మంతీ జరుపుతారు. మధ్యాహ్నం 12.15 గంటలకు నీరుగట్టువారిపల్లిలో భోజన విరామానికి ఆగుతారు. మధ్యాహ్నం 3.30 గంటలకు తిరిగి పాదయాత్ర ప్రారంభించి టీకేఎస్ వెంచర్ అన్నమయ్య నగర్ లో బహిరంగసభలో పాల్గొంటారు. సాయంత్రం తంబళ్లపల్లి నియోజకవర్గంలోకి లోకేష్ పాదయాత్ర ప్రవేశించనుంది. రాత్రి నందిరెడ్డివారిపల్లి చేనేతనగర్ లో లోకేష్ బస చేయనున్నారు.