Chandrababu : కుప్పంలో ఇంటింటికీ తిరుగుతున్న చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో రెండో రోజు పర్యటిస్తున్నారు.;

Update: 2024-03-26 11:45 GMT
Chandrababu : కుప్పంలో ఇంటింటికీ తిరుగుతున్న చంద్రబాబు
  • whatsapp icon

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో రెండో రోజు పర్యటిస్తున్నారు. ఆయన నియోజకవర్గంలో ఇంటింటికీ తిరిగి ప్రచారాన్ని నేడు నిర్వహించారు. కుప్పం టీడీపీ నేతలతో కలసి తమ ఇంటికి వచ్చిన చంద్రబాబును మహిళలు హారతులతో స్వాగతం పలికారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పం నియోజకవర్గంలో మరింత అభివృద్ధి పనులు చేపడతామనని వారికి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

సమస్యలను అడిగి...
వారి వ్యక్తిగత సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నారు. విద్య, వైద్యం వంటి సదుపాయాల గురించి ఆరా తీశారు. నలభై రోజులు ఓపిక పడితే కుప్పం డెవలెప్‌మెంట్ ను తనకు వదిలేయాలని, తాను హంద్రీనీవా నీళ్లను కూడా కుప్పం నియోజకవర్గానికి తెచ్చి చూపిస్తానని చంద్రబాబు తెలిపారు. వారి నుంచి వినతి పత్రాలను స్వీకరించారు.


Tags:    

Similar News