మంత్రాలయంలోకి లోకేష్
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు మంత్రాలయం నియోజకవర్గంలో పర్యటించనున్నారు
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు మంత్రాలయం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. లోకేష్ పాదయాత్ర నేటికి 80వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకూ లోకేష్ 1020 కిలోమీటర్ల దూరం నడిచారు. ఉదయం ఎనిమిది గంటలకు తుంబళం క్రాస్ విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. 8.20 గంటలకు మంత్రాలయం అసెంబ్లీ నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశిస్తుంది. 8.30 గంటలకు గవిగట్టు క్రాస్ వద్ద స్థానికులతో సమావేశం అయ్యారు. వారి సమస్యలపై చర్చించారు.
నేటి కార్యక్రమాలు...
ఉదయం 9.05 గంటలకు బాపులదొడ్డి క్రాస్ వద్ద స్థానికులతో సమావేశం కానున్నారు. 9.55 గంటలకు పేకలబెట్ట క్రాస్ వద్ద స్థానికులతో సమావేశం కానున్నారు.12.00 గంటలకు కోసిగిలో స్థానికులతో మాటామంతీ కార్యక్రమంలో లోకేష్ పాల్గొంటారు.12.30 గంటలకు కోసిగి యల్లమ్మ దేవాలయం సమీపంలో భోజన విరామానికి ఆగుతారు. సాయంత్రం ఐదు గంటలకు కోసిగి యల్లమ్మ దేవాలయం వద్ద బహిరంగసభలో లోకేష్ ప్రసంగిస్తారు. 6.15 గంటలకు కోసిగి బస్టాండు వద్ద స్థానికులతో సమావేశం కానున్నారు..6.25 గంటలకుక కోసిగి తేరుబజార్ వద్ద షాప్ కీపర్లతో భేటీ అవుతారు. రాత్రికి కోసిగి శివారులో బస చేస్తారు.